![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -375 లో.....సీతాకాంత్ డల్ గా ఇంటికి వస్తాడు. సీతాకాంత్ దగ్గరికి శ్రీలత వెళ్లి నేను నీకు ఇచ్చిన గడువు దగ్గర పడుతుంది. ముహూర్తం పెట్టమంటావా అని అడుగుతుంది. నన్ను అర్ధం చేసుకోవాల్సిన నువ్వే ఇలా బాధపెడుతావ్ అనుకోలేదు అమ్మ అని సీతాకాంత్ అంటాడు. నువ్వే నన్ను అర్ధం చేసుకోవడం లేదురా.. నీ సంతోషం కోసమే ఇదంతా చేస్తున్నానని శ్రీలత నటిస్తుంటుంది.
మరొకవైపు ఫణీంద్ర, సుశీల ఇద్దరు రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడే రామలక్ష్మి బాధపడుతూ వస్తుంది. నేను ఇక్కడ మైథిలీగా ఉండలేక అటు సీతా సర్ కి భార్యగా ఉండలేక నేను నరకం అనుభవిస్తున్నానని రామలక్ష్మి ఎమోషనల్ అవుతుంటుంది. మా వాళ్లే ఇదంతా అని ఫణీంద్ర అంటాడు. మీ వాళ్ళ కాదని రామలక్ష్మి అంటుంది. ఇక మీదట ఆయన నా కోసం రాడని రామలక్ష్మి అంటుంది. ఏం జరిగి ఉంటుందని ఫణీంద్ర, సుశీల అనుకుంటారు.
మరొకవైపు సీతాకాంత్ దగ్గరికి రామ్ వచ్చి ఫోన్ తీసుకొని రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు. మిస్ మీతో ఆడుకోవాలని ఉంది రండీ అని రామ్ అనగానే.. నేను ఊరు వెళ్తున్నానని రామలక్ష్మి చెప్తుంది. సీతా మిస్ ఊరు వెళ్తుందంట అని రామ్ అంటాడు. వెళ్లే వాళ్ళని ఆపొద్దని సీతాకాంత్ అంటాడు. ఆ మాటలు రామలక్ష్మి ఫోన్ లో వింటుంది. నేను మిస్ ని కలవాలి అని రామ్ అనగానే డ్రైవర్ కి చెప్పి రామ్ ని తన వెంట పంపిస్తాడు. అదంతా చూస్తున్న శ్రీలత ఇదే కదా మనకి కావల్సింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |